సూపర్ స్టార్ మహష్ బాబు నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఈసినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. మహేష్ బాబు గతంలో ఎన్నడూ కనిపించినవి విధంగా మాస్ లుక్ తో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గానేే ఈసినిమా నుండి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయగా ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తాజాగా మీడియాతో ముచ్చటించిన మీనాక్షి చౌదరి పలు ఆసక్తికర విశేషాలు తెలియచేశారు. ఈసినిమా కోసం నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా.. ప్రస్తుతం అయితే షూటింగ్ జరుగుతుంది.. జనవరిలో ఒక ప్రోపర్ మాస్ సినిమా చూస్తారు.. మహేష్ గారు ఒక ప్రోపర్ బ్లాస్ట్ తో వస్తున్నారు. ఈసినిమా చాలా స్పెషల్ ప్రొజెక్ట్.. ఈసినిమా కథ, స్టోరీ లైన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది.. సినిమా చూసిన తరువాత మీకే అర్థమవుతుంది.. ఈసినిమా వల్ల మహేష్ బాబు గారితో నటించే నా డ్రీమ్ నిజమైంది అంటూ తెలిపింది. ఇక మీనాక్షి చేసిన వ్యాఖ్యలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేశాయి..
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: