టాలీవుడ్ టాలెండ్ హీరో అడివి శేష్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ కథలను ఎంచకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అందుకే ఇప్పటివరకూ పరాజయం అనేదే లేకుండా వరుస హిట్లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అడివి శేష్ లిస్ట్ లో ఉన్న సినిమా గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపినా అధికారిక ప్రకటన రావడానికి చాలా టైమే పట్టింది. ఈ ఏడాది జనవరిలో ఈసినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత ఓ అప్ డేట్ తో వచ్చారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో బనితా సంధును హీరోయిన్ గా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. కాగా బనితా సంధు తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ లో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే కదా.
The talented actress #BanitaSandhu joins India’s most awaited spy sequel, #G2 🔥❤🔥
Team #G2 welcomes her to the mission 💥
Shoot begins soon 🔥 @AdiviSesh @vinaykumar7121 @peoplemediafcy @AAArtsOfficial @AKentsOfficial @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla… pic.twitter.com/KH4Lo92YlI
— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2023
కాగా మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: