సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఈసిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్ల్, పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నవంబర్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Worth the wait 🙂 23-11-23 @AnimalTheFilm @VangaPictures @TSeries pic.twitter.com/pxfiVrMDw7
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 20, 2023
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: