సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూమెంట్ వచ్చేసింది.SSMB 28 టైటిల్ వీడియో ను కొద్దిసేపటి క్రితం విడుదలచేశారు మేకర్స్.మాస్ స్ట్రైక్ పేరుతో కృష్ణ జయంతి సందర్భంగా ఈటైటిల్ వీడియో ను రిలీజ్ చేశారు.మొదట ఈటైటిల్ వీడియో ని ఫ్యాన్స్ చేత థియేటర్ లో లాంచ్ చేయించగా ఆ తరువాత యూట్యూబ్ లోకి వదిలారు.ఇక ఈసినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా గ్లింప్స్ కూడా అదిరిపోయింది.గ్లింప్స్ చూస్తుంటే సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా వుంది అలాగే వీడియోలో మహేష్ లుక్ అదిరిపోయింది.దానికితోడు యాక్షన్స్ సీన్స్ ,థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే గుంటూరు స్లాంగ్ లో ఏంది అట్టా చూస్తున్నావ్ బీడీ 3D లో కనపడుతుందా ?అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇలా ఈ వీడియో మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల మరో హీరోయిన్ గా కనిపించనుంది.ఈసినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానుంది.హరికహాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13న గుంటూరు కారం థియేటర్లోకి రానుంది.
ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు,ఖలేజా థియేటర్లో కన్నా బుల్లితెర ఫై సెన్సషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.మరి ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న గుంటూరు కారం ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: