ఈఏడాది పఠాన్,గదర్ 2,జవాన్ సినిమాలు బాలీవుడ్ కి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాయి.ఈ మూడు సినిమాలు కలిపి 2500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తాచాటాయి.ఇక హిందీ జవాన్ తరువాత పెద్ద సినిమాగా విడుదలైయింది సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3.ఈసినిమా నిన్న థియేటర్లలోకి రాగ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 94కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి100కోట్లకు దగ్గరలో ఆగిపోయింది.పాజిటివ్ టాక్ రావడం అలాగే నిన్న ఆదివారం దానికి తోడు దీపావళి కావడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సల్మాన్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా టైగర్ 3 రికార్డు సృష్టించింది.ఇందులో ఇండియాలో 52.50కోట్ల గ్రాస్ రాబట్టగా నెట్ 44.50కోట్లు అలాగే ఓవర్సీస్ లో 41.50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని నిర్మాతలు అఫిషియల్ గా ప్రకటించారు.అంతేకాదు టైగర్ 3 ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టిన మొదటి హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.
History created on Diwali day! Love pouring in from all across the globe ❤️
Watch #Tiger3 at your nearest big screen in Hindi, Tamil & Telugu.
Book your tickets now – https://t.co/K36Si5lgmp | https://t.co/RfOSuJumYF #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/cipJv8utaj
— Yash Raj Films (@yrf) November 13, 2023
ఓవరాల్ గా అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన హిందీ సినిమాల జాబితాలో టైగర్ 3 నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.ఆదిపురుష్ ,జవాన్,పఠాన్ తొలి మూడు స్థానాలో కొనసాగుతున్నాయి.ఇక బాలీవుడ్ లో ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో టైగర్ 3 ఫుల్ రన్ లో మంచి వసూళ్లను దక్కించుకోనుంది.అంతేకాదు ఈసినిమాతో చాలా రోజుల తరువాత సల్మాన్ హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లో రానున్నాడు.మనీష్ శర్మ డిక్ట్ చేసిన ఈసినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ ,రేవతి కీలక పాత్రల్లో కనిపించారు.యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: