రాయన్- ప్రముఖ సంస్థలకు తెలుగు రిలీజ్ హక్కులు

noted distribution production houses got raayan telugu release rights

ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ఒకపక్క షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. నిన్న ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈపాటకు మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా తెలుగు రిలీజ్ హక్కులకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సురేష్ బాబు అలాగే ఏషియన్ వారు సొంతం చేసుకున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.