స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ గురు

vijay antony love guru movie streaming on ott now

విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఆయన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఆయన నుండి వచ్చిన సినిమా లవ్ గురు. తమిళ్ లో ఈసినిమా రోమియో అనే టైటిల్ తో విడుదలైంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో కామెడీ ప్లస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోని మొదటిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించడం.. దానికి తోడు తన నటన కూడా ఆకట్టుకోవడంతో మంచి ప్రశంసలు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు సొంతం చేసుకున్నాయి. ప్రముఖ సంస్థ అయిన ప్రైమ్ వీడియోస్ వారు అలానే ఆహా వారు ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. నేటి నుంచి ఈసినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ పై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

కాగా ఈసినిమాలో ఇంకా గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని ఈసినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫి ఫరూక్ జే బాష.. సంగీతం భరత్ ధనశేఖర్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.