హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాదు మరోసారి పవర్ స్టార్ తన స్వాగ్, డైలాగ్, లుక్స్ తో మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నట్టు అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈసినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చింది. దసరా కానుకగా ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. పోలీస్ దుస్తుల్లో మాస్ అవతార్ లో ఉన్న ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది
The weapon of destruction 💥💥
Team #UstaadBhagatSingh wishes everyone a Happy Ayudha Puja and Dussehra ❤️🔥❤️🔥
@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @SonyMusicSouth @ubsthefilm pic.twitter.com/Q5VYKSzRa0— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2023
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: