టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’ తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ మేరకు మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు. కాగా ఆరు రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ. 104 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ అరుదైన మార్క్‌ను చేరుకోవడం నందమూరి బాలకృష్ణకు వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు ఆయన నటించిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు కూడా 1 మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకున్నాయి. అయితే తాజా వసూళ్లతో బాలయ్య ‘హ్యాట్రిక్’ అందుకున్నట్లయింది.
This DASARA is UNANIMOUS & belongs to #BhagavanthKesari 😎💥#DasaraWinnerKesari WW Grosses sensational 1️⃣0️⃣4️⃣CR & going super strong at the box office🔥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/CKl3XArKYn
— Shine Screens (@Shine_Screens) October 25, 2023
అలాగే టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఒకే హీరోకి చెందిన 3 సినిమాలు ఇలా వరుసగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం కూడా ఇదే ప్రథమం. తద్వారా బాలయ్య ఒక అరుదైన రికార్డును సాధించినట్లయింది. మరోవైపు ‘భగవంత్ కేసరి’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో పాటు ఫామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే కథాంశం ఉండటం కలిసొస్తోంది. దీంతో మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద ‘భగవంత్ కేసరి’ హవా కొనసాగుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: