‘భగవంత్ కేసరి’ సినిమా అద్భుతమైన చిత్రమని, ఇందులో హీరో నందమూరి బాలకృష్ణ, నటి శ్రీలీల ఇరువురూ తమ అత్యద్భుతమైన నటనను కనబరిచారని పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయం సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి కూడా అడుగుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపధ్యంలో ‘భగవంత్ కేసరి’ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో అనిల్ రావిపూడి ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. ‘భగవంత్ కేసరి’ గురించి నాకు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ యాసలో బాలకృష్ణ గారు డైలాగ్స్ చెబితే చాలా కొత్తగా ఉంటుందన్నా. ముందు నుంచీ ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ అనుకుని, ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’గా మార్చాడు. ఎక్కువగా ఎంటర్‌టైనింగ్ సినిమాలు తీసే అనిల్ ఇలాంటి బలమైన కథను రాసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. అనిల్‌లో చాలా ట్యాలెంట్ వుంది. అనిల్ ఇప్పుడు 2.o. తను ఇకపై ఇటువంటి అద్భుతమైన కథలే తెలుగు చిత్ర పరిశ్రమకు రాయాలి. ఇంత మంచి చిత్రాన్ని అందించిన అనిల్‌కు అభినందనలు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తమన్ చక్కని మ్యూజిక్ చేశారు. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘సమరసింహారెడ్డి’, ‘లెజెండ్’ వంటి సినిమాలన్నీ క్లాసిక్స్. ఇప్పుడు ఇదే కోవలో మరో క్లాసిక్‌గా భగవంత్ కేసరి వచ్చింది. బాలకృష్ణ గారి డెడికేషన్‌తో ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది. దీనికి కారకులైన బాలకృష్ణ గారికి నిజంగా సలాం కొట్టాలి. ఇలాంటి సినిమాలు చేస్తూ క్లైమాక్స్‌లో అమ్మాయితో ఫైట్ ఒప్పుకున్నందుకు బాలయ్య గారికి హ్యాట్సప్ . ‘భగవంత్ కేసరి’ లాంగ్‌రన్ ఫిల్మ్. తప్పకుండా ప్రతి తెలుగు కుటుంబం ఈ సినిమా చూస్తుంది’’ అని దిల్ రాజు పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: