శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న సినిమా ఆదికేశవ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో నటించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ షూటింగ్ లేట్ గా పూర్తవ్వడంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ ఈసినిమాకు రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే సిత్తరాల సిత్రావతి అనే పాటను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లీలమ్మో అంటూ వచ్చే పాటను రిలీజ్ చేశారు. ఇక ఈపాట ఫుల్ మాస్ బీట్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు వైష్ణవ్, శ్రీలీల మాస్ స్టెప్స్ కూడా హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
Unleashing the MASS BLAST with an Explosive ENERGY of #PanjaVaisshnavTej & @sreeleela14!💥#Leelammo song is out now! 🕺💃
A @gvprakash Musical 🥁🎵
🎤 @AzizNakash @IndravathiChauh
✍️ @LyricsShyam#Aadikeshava #JojuGeorge @aparnaDasss… pic.twitter.com/QCCAKjZCck— Sithara Entertainments (@SitharaEnts) October 25, 2023
కాగా ఈసినిమాలో అపర్ణా దాస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అపర్ణా దాస్. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: