సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీ అయిపోయారు. ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది బరిలో దిగనుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు రజినీ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రజనీకాంత్ 170వ సినిమా ఇది. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టారు.ఈనేపథ్యంలో దాదాపు 33 ఏళ్ల తరువాత అమితాబ్ తో కలిసి షూటింగ్ చేస్తుండటంతో రజినీ తన ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ అమితాబ్ బచ్చన్ తో నా 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s “Thalaivar 170” directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y
— Rajinikanth (@rajinikanth) October 25, 2023
కాగా ఈసినిమాలో అమితాబ్ తో పాటు రానా ఇంకా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈసినిమాకు సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: