పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నాడు తరుణ్ భాస్కర్. ఆతరువాత ఈ నగరానికి ఏమైంది సినిమా తీశాడు. ఆ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ నుండి మరో సినిమా కోసం వెయిట్ చేస్తుండగా తానే హీరో అవతారం ఎత్తి ఒక సినిమా తీశాడు. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో పలు క్యారెక్టర్లలో కూడా నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు లాంగ్ గ్యాప్ తరువాత మూడో సినిమాతో వస్తున్నాడు. టైటిల్ నేమ్ దగ్గర నుండే ఈసినిమాపై క్యూరియాసిటీని పెంటాడు తరుణ్ భాస్కర్. ఇక ఈసినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ ఇంకా డైలాగ్స్ బాగున్నాయి. మరోసారి డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
కాగా క్రైమ్ కామెడీ సినిమాగా రాబోతున్న ఈసినిమాలో మొత్తంగా 8 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: