వచ్చే ఏడాదికి మారిన కంగన ఎమర్జెన్సీ రిలీజ్

kangana ranaut emergency movie release date postponed

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలతో, పాత్రలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు హిందీలో మాత్రమే కాకుండా వేరే భాషల్లో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా చంద్రముఖి2తో వచ్చింది. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే తను తన కొత్త పాజెక్ట్ తో బిజీ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈసినిమాలో కంగనా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా వహిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రలో ఈసినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈవిషయాన్ని కంగనా తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ తెలియచేసింది. పోస్ట్ లో ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు.. ఒక వ్యక్తిగా నాకు కూడా ఒక పరీక్ష లాంటిది.. ఈ సినిమా టీజర్ కు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల మేము ఎంతో ఆనందించాం.. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ గురించి అడుగుతున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల అనుకున్న సమయానికి ఈసినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాం.. 2024లో ఈసినిమా రిలీజ్ ఉంటుంది.. రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాం అంటూ తెలిపింది.

కాగా ఈసినిమాలో కంగనా నటిస్తూనే నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తుంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్ పై కంగనా ఈసినిమాను నిర్మిస్తుంది. ఇంకా ఈసినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయ తల్పాడే, సతీష్ కౌషిక్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 4 =