బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్.. కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. కేవలం వారసత్వాన్నే నమ్ముకోకుండా డ్యాన్స్, ఫైట్స్, నటనలో తన టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా టైగర్ ష్రాఫ్ సినిమాలలో యాక్షన్ హై వోల్టేజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘గణపథ్’. ‘ఏ హీరో ఇస్ బార్న్’ అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరా పండుగ సందర్భంగా.. అక్టోబర్ 20న ‘గణపథ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా బుధవారం (అక్టోబర్ 18, 2023) దీనిని షేర్ చేశారు. ఇందులో ఎప్పటిలాగే టైగర్ ష్రాఫ్ తన మార్క్ మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలతో అలరించాడు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో ఉండబోతోందని ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. కాగా ఈ ప్రోమో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
AMITABH BACHCHAN – TIGER SHROFF – KRITI SANON: ‘GANAPATH’ NEW PROMO OUT NOW… 20 OCT RELEASE… Ahead of its theatrical release on 20 Oct 2023, Team #Ganapath: A Hero Is Born – starring #AmitabhBachchan, #TigerShroff and #KritiSanon – unleashes a special promo: World of #Ganapath.… pic.twitter.com/DPYRV7l5So
— taran adarsh (@taran_adarsh) October 18, 2023
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి టైగర్ ష్రాఫ్, కృతిసనన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ‘గణపథ్’ సినిమా తెలుగు టీజర్‌ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జమీల్ ఖాన్, గిరీష్ కులకర్ణి, రెహమాన్, జియాద్ బక్రీ, శ్రుతి మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గుడ్ కో, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: