‘గుంటూరు టాకీస్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగొడ్డ.. ఆపై తనదైన శైలిలో ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో ‘డీజే టిల్లు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అతడికి యూత్‌లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తన తదుపరి సినిమాను తెరకెక్కించడానికి బాగా టైమ్ తీసుకున్నాడు సిద్దు. ఈ నేపథ్యంలోనే ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నాడు. అలాగే దీనితోపాటుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సిద్దు జొన్నలగొడ్డ మరో కొత్త సినిమాను ప్రారంభించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ప్రముఖ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. కాగా ఈ చిత్రానికి ‘తెలుసు కదా’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగగా.. నేచురల్ స్టార్ నాని, హీరోలు నితిన్, ఆది పినిశెట్టి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే దర్శకులు హరీష్ రెడ్డి, బాబీ, నందినీ రెడ్డిలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో రాశీఖన్నా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టిలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
“Unveiling moments from the grand opening of #TelusuKada today!
🎬 First Clap by the Natural Star @NameisNani
🎥 Camera Switch On by @dirbobby
🎬 1st Shot Directed by @harish2you
📜 Script handover by @actor_nithiin & @AadhiOfficialFilm being Directed by @NeerajaKona &… pic.twitter.com/MWkBPYm82E
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 18, 2023
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇంకా యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: