కార్తీ జపాన్ టీజర్ రిలీజ్

Japan Karthi movie teaser out now

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమాలో కార్తి డిఫరెంట్ మేకోవర్ తో వస్తున్నాడని. అంతేకాదు ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలోత బిజీగా ఉంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. కార్తీ గెటప్ కానీ, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈసినిమాతో కార్తీ మరో హిట్ కొట్టడం ఖాయం అన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కూడా ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 15 =