అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా ఆక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై క్రేజ్ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొదట చెప్పుకోవాల్సింది బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని చెప్పినప్పుడే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయిపోయింది. బాలకృష్ణ మాస్ గురించి తెలిసిందే. మరోవైపు అనిలి రావిపూడి కామెడీ ఎంటర్ టైనర్ లను తీయడంలో దిట్ట. దాంతో బాలకృష్ణ ఎలాంటి సినిమా తీస్తాడా అని చూశారు. మొదటి సారి ఫ్యాక్షన్ డ్రాప్ తో పాటు దానికి ఎమోషనల్ ను యాడ్ చేసి భగవంత్ కేసరి తో వస్తున్నాడు.
మరో ఆసక్తికరమైన ఎలిమెంట్ బాలకృష్ణ ఇంకా శ్రీలీల కాంబినేషన్. ఈసినిమాలో బాలకృష్ణ-శ్రీలీల బాండింగ్ హైలెట్ అవ్వబోతుందని ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. తండ్రీ-కూతుళ్లుగా వీరిద్దరి కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ఉయ్యాలో ఉయ్యాల పాట ఎంత రెస్పాన్స్ తెచ్చుకుందో చూశాం.
ఈసినిమాకు కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీస్తున్నాడు. అఖండ, వీరసింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఈసినిమాకు కూడా థమనే సంగీతం అందిస్తున్నాడు. అఖండ సినిమాకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ప్లస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈసినిమాకు కూడా ఖచ్చితంగా థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటాడన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
మరోవైపు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. బోయపాటితో అఖండ, ఆతరువాత గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు అభిమానులు ఈసినిమాతో హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: