భగవంత్ కేసరి రన్ టైం రివీల్ 

bhagavanth kesari run time revealed

మచ్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి మరో రెండు రోజుల్లో థియేటర్లర్లోకి రానుంది.ట్రైలర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.బాలకృష్ణ ను ఈసినిమాలో సరికొత్త గా చూపించనున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా  పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈసినిమాకు రన్ టైం కూడా కొంచెం ఎక్కువగానే వుంది.164 నిమిషాల రన్ టైంతో ఈసినిమా రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు మాత్రం పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.బాలకృష్ణ,శ్రీలీల నటన అనిల్ డైరెక్షన్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయని టాక్.ఇక మరి కొన్ని గంటల్లో అసలైన ఫలితం తేలనుంది.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే వున్నాయి.దాంతో భగవంత్ కేసరి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్  ఓపెనింగ్స్ రాబట్టుకునే ఛాన్స్ కూడా వుంది.

ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల,బాలయ్యకు కూతురిగా కనిపించనుంది.అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర పోషించాడు.తెలుగులో అతనికిదే మొదటి సినిమా.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మించారు.ఈసినిమా విజయం సాధిస్తే బాలయ్య హ్యాట్రిక్ కొట్టనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =