భగవంత్ కేసరిలో మా మధ్య కెమిస్ట్రీ అద్భుతం – నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Interesting Comments on Actress Sreeleela

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్ అని పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా చేస్తుండటం విశేషం. కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నటసింహా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “దుర్గమ్మ నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీ శక్తికి సంబధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఈ సినిమాలో కూడా అమ్మాయిని పులిలా పెంచాలనే మాట వుంది. అలాగే సినిమా పేరు కూడా భగవంతుడితో మొదలైయింది. నేలకొండ భగవంత్ కేసరి హై ఎనర్జీతో వుంటుంది. అనిల్ రావిపూడి భిన్నమైన సినిమాలు చేశారు. ముందు మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్‌తో ‘పటాస్’ చేశాడు. అందులో కూడా నా పాటని రీమిక్స్ చేశాడు. కొద్దిరోజులక్రితం చాలా అద్భుతమైన కథతో నా దగ్గరకు వచ్చారు. మేమిద్దరం ఈ సినిమాను ఒక సవాల్‌గా తీసుకున్నాం. చాలా హోం వర్క్ చేశాం. నేను ఏది చేసినా నా అభిమానులని దృష్టిలో పెట్టుకుని చేస్తాను” అని పేర్కొన్నారు.

“భగవంత్ కేసరి ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులు, అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇంకా గొప్పగా అలరిస్తుంది. నటుల నుంచి, సాంకేతిక నిపుణుల నుంచి తను కోరుకున్నది రాబట్టుకునే దర్శకుడు అనిల్. ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి ఒక వరం. తమన్ ‘అఖండ’తో బాక్సులు బద్దలగొట్టాడు. అద్భుతమైన పాటలు నేపధ్య సంగీతం అందించాడు. అలాగే రామ్ ప్రసాద్ అద్భుతమైన డీవోపీ. నా ప్రతి కదలిక తనకి తెలుసు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాం. తన కెమరా ద్వారా ఎలాంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేశారో ప్రేక్షకులు చూస్తారు. కాజల్ అద్భుతమైన నటి. చాలా మంచి పాత్ర చేశారు. ఒక విస్పోటనం జరిగితే గానీ ఇలాంటి కలయిక జరగదు. విస్పోటనం జరిగితేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి మా భగవంత్ కేసరి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ… ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతచక్కగా ఇందులో పాత్రలని మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తనతో మళ్ళీ కలసి పని చేయడానికి ఎదురుచూస్తుంటాను” అని తెలిపారు.

ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ.. “శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయి. ఆడ,మగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారు. అంత అద్భుతంగా వచ్చింది మా మధ్య కెమిస్ట్రీ. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలనే తనప శ్రీలీలలో వుంది. అందుకు తనకి అభినందనలు. అర్జున్ రామ్ పాల్ నటన అదరగొట్టారు. తనే డబ్బింగ్ చెప్పారు. ప్రతి పాత్ర అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా వుంది. దాచిపెట్టాం. సినిమా చాలా కూల్ మొదలౌతుంది. తర్వాత దబ్బిడి దిబ్బిడే. ప్రేక్షకులందరినీ సినిమాలో కి తీసుకెళ్ళిపోతుంది. నిర్మాతలు హరీష్, సాహు చాలా అద్భుతంగా సినిమాని నిర్మించారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ సినిమా విడుదల కాబోతుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కావాలి. అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.