భగవంత్ కేసరి నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా

sreeleela shares interesting facts about Bhagavanth Kesari Movie

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈసినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భగవంత్ కేసరి డాటర్ రోల్ చేయడం ఎలా అనిపించింది ?
భగవంత్ కేసరి కథ నాకు చాలా నచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయి. ఒక ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం వుండే సినిమా ఇది. నటనని నిరూపించుకునే సినిమాలా అనిపించింది. ఇప్పుడు కాకపొతే మరో కొంతకాలం తర్వాత ఇలాంటి పాత్ర చేయలేను. ఈ పాత్ర చేయడానికి ఇదే సరైన సమయం. శ్రీలీల అనగానే ప్రేక్షకుల మనసులో డ్యాన్స్ అనే ముద్రపడిపోయింది. ఇది చాలా పాజిటివ్ అయినప్పటికీ ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని వుంటుంది. ఈ సినిమాతో నాకు ఆ అవకాశం దొరికిందని అనిపించింది.

మొదటిసారి బాలకృష్ణ గారు సెట్స్ కి వస్తున్నపుడు మీ రియాక్షన్ ఏమిటి ?
మొదట షాట్ ట్రైలర్ లో చూపించిన ట్రైనింగ్. నేను పుష్ అప్స్ చేయాలి. కానీ చేయలేకపోతుంటాను. ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారు. షాట్ అయిన తర్వాత నిజంగా నీకు పుష్ అప్స్ చేయడం రాదా ? అని అడిగారు. డైరెక్టర్ గారే అలా చేయమన్నారని చెప్పాను.(నవ్వుతూ) నిజానికి నాలో కొంచెం నెర్వస్ ఫీలింగ్ వుంది. ఆయన్ని కలసినప్పుడు ఒక భయం వుంది. ఐతే ఆయన్ని కలిసిన మరుక్షణమే ఆ భయం పోయింది. నిజంగా ఆయనకి యాప్ట్ పేరు పెట్టారు. ఆయనది పసి మనసు. చాలా స్వీట్.

అనిల్ రావిపూడి గారి సినిమాల్లోని హీరోయిన్స్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ వుంటుంది. ఇందులో మీ పాత్రకు కూడా అలాంటి స్టైల్ ఇచ్చారా ?
ఈ సినిమాతో అనిల్ రావిపూడి గారు కూడా ఒక డిఫరెంట్ స్టైల్ కి వచ్చారు. మీరు గమనిస్తే ప్రమోషనల్ మెటిరియల్ అన్నింట్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందులో నేను చేసిన విజ్జి పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. విజ్జి పాప భయపడే అమ్మాయి. అదే సమయంలో చలాకీగా వుంటుంది.

బాలకృష్ణ గారు ఏవైనా ఇన్ పుట్స్ ఇచ్చారా ?
బాలకృష్ణ గారు అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. సినిమా కాకుండా చాలా రంగాలపై ఆయనకి చాలా పరిజ్ఞానం వుంది. నేను మెడిసిన్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని చాప్టర్స్ పై చాలా లోతైన పరిజ్ఞానంతో మాట్లాడేవారు. ఈయన మెడిసిన్ చేయలేదు కదా ఇదెలా తెలిసిందని ఆశ్చర్యపోయేదాన్ని. షూటింగ్ సమయంలో కూడా ఒక సీన్ ఎలా చేస్తే బావుంటుందో చెప్పేవారు. విజ్జి పాప., నేలకొండ భగవంత్ కేసరి.. ఈ రెండు పాత్రలు కూడా మాతో పాటే వచ్చేశాయి.

కాజల్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
కాజల్ గారు బ్యూటీ విత్ బ్రెయిన్. అమేజింగ్ యాక్టర్. చాలా స్వీట్ హార్ట్. ఆమె టైమింగ్ అద్భుతం. చాలా మంచి సలహాలు ఇచ్చారు. చాలా విషయాలు నేర్పారు. కాజల్ గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. కాజల్ గారితో కాంబినేషన్ సీన్స్ వున్నాయి. ఆమె కామెడీ టైమింగ్ నాకు చాలా నచ్చింది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి.

ఇందులో మీకు సవాల్ తో కూడుకున్న సీన్ ఏమిటి ?
ఈ సినిమా మొతాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను. ఒక ఆర్టిస్ట్ గా నన్ను నేను పరీక్షించుకునే సమయం సిట్యువేషన్ వచ్చింది. విజ్జి పాప పాత్ర నాలో వుండిపోయింది. ‘’ఆడ పిల్ల లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా వుండాలనే ఓ డైలాగ్ ఇందులో వుంది. ఇది హీరో తపన. ఈ తపన ని ప్రేక్షకులు సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే నేను సరిగ్గా చేయాలి. ఆ తపనతో ఈ సినిమా చేశాను.

ఈ పాత్ర ఖచ్చితంగా నన్ను మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇందులో ఫాదర్ డాటర్ ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ గా వుంటుంది. నా పాత్రలో కూడా చాలా వైవిధ్యం వుంటుంది. అనిల్ రావిపూడి గారు అద్భుతంగా తీశారు. నా రియల్ లైఫ్ చిచ్చా మా అమ్మ. తను చిన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండమని చిచ్చా లానే చెప్పేది. అందుకే ఈ కథతో చాలా కనెక్ట్ అయిపోయాను.

ఇంత త్వరగా దాదాపుగా డజను సినిమాలకు చేరువైపోయారు ? ఎలా అనిపిస్తుంది ?
చాలా ఆనందంగా వుంది. దేవుడికి, నాకు మొదట అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి, నాపై నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. నిజానికి ఇది పెద్ద బాధ్యత గా భావిస్తున్నాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =