గోపీచంద్32 మిలాన్ షెడ్యూల్ పూర్తి

gopichand and srinu vaitla movie milan schedule completed

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా షూటింగ్ మొదలైంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ మిలాన్‌ లో స్టార్ట్ చేసినట్టు అప్ డేట్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. మిలాన్ లో షూటింగ్ పూర్తయినట్టు తెలియచేశాడు.
మిలాన్ లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ గ్రాండ్ సాంగ్ ని కూడా ఈ షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

కాగా ఈసినిమా కాకుండా గోపీచంద్ మరో సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ భీమా సినిమా చేస్తున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =