సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్-స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లియో.మరో 6రోజుల్లో విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా నుండి విడుదలైన మొదటి సాంగ్ నా రెడీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఒరిజినల్ వెర్షన్ లో మాత్రమే ఈ సాంగ్ విడుదలైయింది.ఇక ఇప్పుడు తెలుగు తోపాటు కన్నడ,మలయాళ,తమిళ,హిందీ భాషల్లో విడుదలచేశారు.నే రెడీ సాంగ్ తెలుగు లో కూడా చాలా క్యాచీ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా భారీ స్థాయిలో విడుదలకానుంది.సుమారు 3000 కుపైగా స్క్రీన్ లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.దాంతో మొదటి రోజు 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.హిట్ టాక్ వస్తే మాత్రం లియో కోలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం.ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్ గాతెరకెక్కిన ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.చాలా కాలం తరువాత విజయ్,త్రిష కలిసి మళ్ళీ నటించారు.సంజయ్ దత్,అర్జున్ సర్జా,మిస్కిన్, ప్రియా ఆనంద్,గౌతమ్ వాసు దేవ్ మీనన్,అభిరామి వెంకటాచలం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించింది.ఈసినిమా తమిళ్ తోపాటు ఇతర భాషల్లో అక్టోబర్ 19న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: