సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఇక ఈసినిమా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈసినిమా ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు..సంగీత్ శోభన్, శాన్వి, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం.. సంతోష్ కట
బ్యానర్స్.. అభిషేక్ పిక్చర్స్
నిర్మాత.. అభిషేక్ నామా
సినిమాటోగ్రఫి..జగదీష్ చీకటి
సంగీతం..అనూప్‌రూబెన్స్
కథ
ఈసినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. అనసూయ, రవివర్మకు రామ్ లక్ష్మణ్(దేవాన్ష్ నామా, అనిరుథ్ నామా) అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. పేదరికంతో జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఇద్దరి పిల్లల్లో చిన్న కొడుకుకి విమానం ఎక్కాలని కలలు కంటూ ఉంటాడు. ఈనేపథ్యంలో తన అన్నతో కలిసి ఏంచేశాడు.. ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. మరోవైపు పెద్దింటి అమ్మాయైన అభితని (సాన్వీ) మణి (సంగీత్) ప్రేమిస్తాడు. వీరి ప్రేమను ఇంట్లో ఒప్పుకోరని ఇద్దరూ లేచిపోతారు. ఈనేపథ్యంలో వీరిద్దరూ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు లాంటి విషయాలను తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
విశ్లేషణ
కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుండి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా పెద్ద పెద్ద సక్సెస్ లు చేస్తారు. ఆమధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా ఆతరువాత వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా.. రీసెంట్ గా వచ్చిన మ్యాడ్ సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా అలాంటి కంటెంట్ బేస్డ్ గా వచ్చిన సినిమానే ప్రేమ విమానం. అందులోనూ మ్యాడ్ సినిమాలో నటించిన సంగీత్ శోభన్ ఈసినిమాలో కూడా నటిస్తుండటంతో ఈసినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.
రెండు కథలను పార్లల్ గా నడుపుతూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రేమ విమానం కూడా అలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే. ఓ వైపు పల్లెటూరిలో ఇద్దరు చిన్నపిల్లలు విమానం ఎక్కాలనే కోరికని, మరో ఊర్లో ఓ ప్రేమ జంట ప్రేమని పారలల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఈ విషయంలో కథ మొదలు నుండి చివరి వరకూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అంతేకాదు పల్లెటూరుల్లో ఉండే రైతుల అప్పుల బాధలు, కరువు పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకే ఎమోషన్ కు ఫిక్స్ అవ్వకుండా సినిమాలో ఫన్, ఎమోషనల్, లవ్ ఇలా పలు ఎలిమెంట్స్ ను చూపించాడు.
పెర్ఫామెన్స్
సంగీత్ శోభన్ ఇప్పటికే నటుడిగా నిరూపించుకున్నాడు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇంకా రీసెంట్ గా వచ్చిన మ్యాడి సినిమాలో ఈజ్ తో నటించి తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో అందరికంటే సంగీత్ శోభన్ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక ఈసినిమాలో ప్రేమికుడిగా కూడా బాగానే చేశాడు. హీరోయిన్ శాన్వి కూడా సహజమైన నటనతో అందం, అభినయంతో ఆకట్టుకుంది. మరోసారి అనసూయకు మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. శాంతమ్మ పాత్రలో చాలా బాగా చేసింది. భర్తను కోల్పోయిన మహిళగా.. ఇద్దరి పిల్లలను పెంచే తల్లిగా, బాధలు ఇబ్బందులు ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇద్దరు పిల్లలు దేవాన్ష్ నామా, అనిరుథ్ నామా కూడా బాగా నచించారు. హీరో తండ్రిగా గోపరాజు రమణ కూడా తనదైన మార్క్ నటనతో చేసుకుంటూ వెళ్లారు. పల్లెటూరిలో చిన్న కిరాణా కొట్టు నడుపుకునే సగటు తండ్రి పాత్రలో గోపరాజు రమణ నటన అద్భుతంగా ఉంది. వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ప్లస్ పాయింట్ అయింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక సినిమాటోగ్రఫి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జగదీష్ చీకటి అందించిన విజువల్స్.. 1990 బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆ క్లైమెట్ అలానే పెల్లెటూరి అందాలు చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/PW1y7aDVPPc/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/bmDq32dcA20/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/_6Z6mWfd8iI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/pWkl7wysJAw/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)