శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్ ఫ్రాంచైజీస్ తరువాత శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా అందులోనూ వెంకటేష్ హీరోగా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా కూడా పొంగల్ రేసులో రానుంది. జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమా టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
The city of Chandraprastha awaits you with an ambitious mission❤️🔥#SAINDHAV Teaser on OCT 16th💥#SaindhavOnJAN13th
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @vboyanapalli @tkishore555 @maniDop… pic.twitter.com/yrlEUUGw7J
— Niharika Entertainment (@NiharikaEnt) October 12, 2023
కాగా కాగా ఈసినిమాలో ఇంకా నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: