జోరుగా హుషారుగా షికారు పోదమ- ఫస్ట్ సింగిల్ హ్యాపీ జర్నీ ప్రోమో రిలీజ్

Joruga Hushaaruga Shikaaru Podama Movie first single promo out

వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ మధ్య కాలంలో వరుసగా లైక్ షేర్ సబ్ స్క్రైబ్, మంచి శకునములే, శ్రీదేవి శోభన్ బాబు, ప్రేమ్ కుమార్ ఇలా పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఏ సినిమా సరైస సక్సెస్ ను అందించలేకపోయింది. అయితో సంతోష్ శోభన్ మాత్రం ఎక్కడా డీలాపడకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం సుభాష్ చంద్ర దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా జోరుగా హుషారుగా షికారు పోదమ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ట్రావెలింగ్ నేపథ్యంలో ఉండబోతుందని అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలు పెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ సింగిల్ హ్యాపీ జర్నీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ న రేపు అంటే అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో ఫల్గుణి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను మిస్టర్ ప్రొడక్షన్స్ తో స్టోరీ క్యాట్ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఎస్ ఒరిజినల్స్ సంస్థలపై ప్రవీణ్ నంబారు, రవి చెన్నా, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ వంశీ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు.. సాయి సంతోష్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + two =