పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 27 ఏళ్ళు.. పవర్ స్టార్‌పై ప్రత్యేక కథనం

Power Star Pawan Kalyan Completes 27 Years in TFI

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఈ పేరు వినపడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. థియేటర్ల వద్ద సందడి మాములుగా ఉండదు. టాలీవుడ్ హీరోలలో మరే హీరోకు లేనటువంటి డై హార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సొంతం. ఎవరైనా ఆయనను ఒక్క మాట అన్నా అభిమానులు తట్టుకోలేరు. ‘అంతకుమించి’ అనే స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ పేరుంది. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగిడి 27 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా పవర్ స్టార్‌పై ప్రత్యేక కథనం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పవన్ కళ్యాణ్.. అచిరకాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1996వ సంవత్సరం అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ కల్యాణ్, సుప్రియ నాయకా నాయికలుగా నటించారు. అయితే ఈ సినిమా పవన్ కల్యాణ్ కే కాకుండా హీరోయిన్ సుప్రియకు కూడా తొలి సినిమా కావడం విశేషం. కాగా సుప్రియ, దివంగత అగ్రనటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు మనవరాలు కావడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ టాలెంట్ ఉన్న నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ సినిమాలు ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక వరుసగా 7 సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోల రేస్ లోకి వచ్చారు. ఈ సినిమాల్లో ‘తొలిప్రేమ’ది ప్రత్యేక స్థానం. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించారు. ఈ సినిమాలో తన ఎనర్జిటిక్ నటనతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు ఆయన. అలాగే ‘తమ్ముడు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్ లో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ‘ఖుషి’ సినిమాతో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టారు. దీంతో పవర్ స్టార్ గా బిరుదును అందుకున్నారు.

అయితే ఈ సినిమాల విజయంతో స్టార్ హీరో స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అనూహ్యంగా ఇక్కడినుంచి కొన్ని సినిమాలు వరుసగా పరాజయంపాలై తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. ‘ఖుషి’ తర్వాత ‘జానీ’ అనే సినిమా తీశారు పవన్. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీని తర్వాత చేసిన ‘గుడుంబా శంకర్’, ‘బాలు’ ‘బంగారం’, ‘అన్నవరం’ సినిమాలు ఓ మాదిరి విజయాలను అందించినా.. అవి పవన్ రేంజ్ లో లేవు అని ఫ్యాన్స్ భావించారు. ఈ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ, దీని తర్వాత వచ్చిన ‘కొమురం పులి’, ‘పంజా’, ‘తీన్ మార్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి సినిమాలు మళ్ళీ నిరాశపరిచాయి. దీంతో పవన్ కళ్యాణ్ పని అయిపొయింది అని అంతా భావించారు. కానీ, జీవితంలో ఉద్ధాన పతనాలు అప్పటికే ఎన్నో చూసిన పవర్ స్టార్ మళ్ళీ సూపర్ కం బ్యాక్ ఇచ్చారు.

2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవన్ సాలిడ్ హిట్ అందుకున్నారు. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఇది చూపించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో పవన్ మళ్ళీ సక్సెస్ బాట పట్టారు. ఇక్కడినుంచి వరుసగా.. ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందించారు. అయితే అనంతరం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాలు హిట్ అనిపించుకున్నాయి. అయితే ఈ క్రమంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా దారుణ పరాజయం పాలైంది. దీంతో ఫ్యాన్స్ బాగా అప్‌సెట్‌ అయ్యారు. ఎందుకంటే.. పవన్ సినిమాలు అంటే.. బ్లాక్ బస్టర్, అంతే.. అని అభిమానులు ఫీల అయ్యేవారు. దీంతో ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది.

అయితే ఆ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు. ఇదే వరుసలో ఇప్పుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజిత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’, క్రిష్‌ జాగర్ల మూడి డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాల ద్వారా ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే వీటితో పాటుగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డితో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్‌ వెల్లడించనున్నారు మేకర్స్. సో.. ఈ చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అలాగే రాజకీయంగానూ పవర్ స్టార్ సక్సెస్ అవ్వాలని, తద్వారా పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ.. తెలుగు ఫిల్మ్ నగర్ నుంచి ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 5 =