నేడు బాలీవుడ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే గురూజీ.. మీరు ఎల్లప్పుడూ సంతోషంతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని.. మీ నటనతో అనేక సంవత్సరాలపాటు మాఅందరికీ స్పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకమైనది.. మీ కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఈ రోజు మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ లో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా బిగ్ ఇప్పుడు తెలుగులో కూాడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే చిరుతో కలిసి అమితాబ్ సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో చేశాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా వస్తున్న ఈసినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తుండగా.. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు.
A Very HAPPY 81st BIRTHDAY 🙏
Guru Ji @SrBachchan ! 💐💐May you be blessed with a long life, filled with happiness & good health!
May you keep enthralling & inspiring millions of us for many many years to come, with your acting genius!! 🙏🙏This Birthday of yours is also… pic.twitter.com/bLQY3OjwkU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: