‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్

Ram Charan's Game Changer Shooting Latest Update

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్‌. ఆయన కథానాయకుడిగా ఆర్‌సీ15గా వస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘విన‌య‌ విధేయ‌ రామ’ త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా కావడం గమనార్హం. ఇక మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ‘గేమ్‌ ఛేంజర్’ మూవీ నయా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నగరంలోని గచ్చిబౌలిలో షూటింగ్ షురూ అయినట్లు అప్‌డేట్ బయటకు వచ్చింది. షూటింగ్ లొకేషన్‌ నుంచి విడుదలైన ఓ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట హల్ చల్‌ చేస్తోంది. ఇందులో షూటింగ్ లొకేషన్‌లో డైరెక్టర్ శంకర్‌, హీరో రామ్ చరణ్‌కు సీన్‌ వివరిస్తుండటం చూడొచ్చు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్‌ డ్యూయల్‌ షేడ్స్‌లో కనిపించునున్నాడని సమాచారం. ఇక తాజా షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు ఇతర నటీనటులు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం షూటింగ్ ఇప్పటికే బాగా ఆలస్యమైన కారణంగా త్వరగా పూర్తిచేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మరో మినీ షెడ్యూల్‌ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణలోని వికారాబాద్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాలలో షూట్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అయితే దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో పాటు మరోవైపు ‘ఇండియన్ 2’ సినిమాను కూడా ఏకకాలంలో చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తున్నారు. 1996లో వీరిద్దరి కలయికలోనే వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్‌’కి సీక్వెల్ గా దీనిని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =