టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి శ్యామ్‌సుందర్ రెడ్డి సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్యామ్‌సుందర్ రెడ్డి నిన్న రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక దిల్ రాజు ఇంట విషాదం చోటుచేసుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు దిల్ రాజుని పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి వెళ్లి శ్యామ్‌సుందర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి దిల్ రాజును ఓదార్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సీనియర్ నిర్మాత అశ్వనీదత్, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు కూడా దిల్ రాజుని కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ‘మ్యాంగో’ గ్రూప్ అధినేత రామ్ వీరపనేని, సింగర్ సునీత దంపతులు కూడా నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయన తండ్రికి నివాళులు అర్పించారు. కాగా వీరితో పాటు పలువురు నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజు తండ్రి మృతికి సంతాపం తెలుపుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: