ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ కు ముఖ్య అతిధిగా పాల్గొన్న నాని టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ లాంచ్ ఈవెంట్ లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. రోషన్ మాట్లాడుతున్నంత సేపు సుమ గారి కళ్ళల్లో ఆనందం చూశాను. రోషన్ తొలి సినిమాకే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. టీజర్ చూసినప్పుడు మా తమ్ముడు చాలా అద్భుతంగా చేశాడనే ఫీలింగ్ వచ్చింది. తొలి సినిమాకే చాలా యీజ్ తో చేశాడు. తనని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా కనిపించాడు. టీజర్ చూసినప్పుడు చాలా బలమైన కంటెంట్ వుందనిపిస్తుంది. రోషన్ కి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్రం తనకి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది. మరో సక్సెస్ ఫుల్ హీరో తెలుగు ఇండస్ట్రీ వచ్చాడని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. టీజర్ చూసినప్పుడు ఆ నమ్మకం వచ్చింది. మానస స్క్రీన్ ప్రెజన్స్ బావుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. రవికాంత్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తనకంటూ ఒక యునిక్ స్టయిల్ వుంది. ఆ యూనిక్ నెస్ ఈ టీజర్ లో కనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో క్యాలిటీ ఫిలిమ్స్ కి మారుపేరుగా మారింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇది వారికి మరో విజయవంతమైన చిత్రం అవుతోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 29న విడుదల చేస్తున్నారు. గ్రేట్ డేట్ ఇది. న్యూ ఇయర్, న్యూ వేవ్ రాబోతుంది ఇండస్ట్రీలోకి. ఆ రోజు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: