అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. 1930 – 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి కొత్త అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమాను ఓవర్సీస్ లో కూాడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అక్కడ కూడా లైకా ప్రొడక్షన్స్ వారే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
This December 15, is gonna be blast 💥 in theatres! We are happy in acquiring the OVERSEAS THEATRICAL RIGHTS 🌍📽️ of #CaptainMiller 🪃
Captain Miller Overseas release by @LycaProductions Subaskaran 🤗✨@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash… pic.twitter.com/7JtDzXLANm
— Lyca Productions (@LycaProductions) September 26, 2023
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్15వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: