మ్యాడ్ నుండి మెలోడియస్ నువ్వు నవ్వుకుంటూ సాంగ్ రిలీజ్

Nuvvu Navvukuntu lyrical song released from mad movie

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. ఈసినిమాతోనే నితిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రౌడ్ సే సింగిల్ అనే పాటను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. నువ్వు నవ్వుకుంటూ అంటూ వచ్చే సాంగ్ ను రిలీజ్ చేశారు. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే .. నా గుండెనేమో గిల్లిపోమాకే అంటూ మెలోడియస్ గా వచ్చే ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా కపిల్ కపిలన్ ఆలపించాడు.

కాగా సంగీత్ శోభన్,రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించగా..గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సోదరి సూర్యదేవర హారిక ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 11 =