పొంగల్ రేసులోకి రానున్న రౌడీహీరో

vijay devarakonda 13th movie title and first look update

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు తన ఫోకస్ ను కొత్త సినిమాలపై పెట్టాడు. ప్రస్తుతం తను పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ సగం పూర్తయిందని.. టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు వచ్చే ఏడాది పొంగల్ కు ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. మరి పొంగల్ రేసుకు ఇప్పటినుండే సినిమాలు క్యూ కడుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు పొంగల్ బరిలోనే దిగుతాయి. మరి అప్పటివరకూ ఇదే రిలీజ్ ను ఉంచుతారా.. లేక మార్చుతారా అన్నది చూడాలి.

కాగా ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కేయూ మోహన్ పనిచేస్తుండగా.. సంగీతం గోపీసుందర్ అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 10 =