‘పెదకాపు-1’ తర్వాత ద్వారక జర్నీ మారుతుంది – నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి

Producer Miryala Ravinder Reddy Reveals Interesting Facts About Peddha Kapu-1

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పెదకాపు-1’ గురించి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పిన విశేషాలు..

  • పెదకాపు పై ఇంత మంచి బజ్ రావడం ఆనందంగా వుంది. పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతోనే మొదటి నుంచి పెద్దగానే చేశాం.
  • కొత్తవాళ్ళతో ఇంతపెద్ద సినిమా చేయడం సాహసం కాదు. కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది.
  • అఖండ లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో పెదకాపు కథ వచ్చింది.
  • తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా వుంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది.
  • ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం వుంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది.
  • ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
  • శ్రీకాంత్ అడ్డాల గారు వెట్రిమారన్ లాంటి వారు. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి.
  • 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం.
  • రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం.
  • ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా అనుకున్నాం. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ.
  • సెన్సార్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పెదకాపులో వైలెన్స్ వుంది. ఆ వెలైన్స్ కి కూడా ఒక కారణం వుంది.
  • ఇందులో ప్రత్యేకంగా ఏ కమ్యూనిటీ ప్రస్తావన వుండదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో దీని గురించి స్పష్టంగా చెప్పాను.
  • పెదకాపు టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే..? శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు.
  • దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు.
  • అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కాబట్టి పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం.
  • విరాట్ కి సినిమాలపై ఆసక్తి వుంది. తను హీరో మెటీరియల్. స్క్రీన్ పై చూస్తున్నపుడు ఒక పెద్ద హీరోని చూసిన అనుభూతినే కలిగింది.
  • ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా ఇంటెన్స్ తో వున్న యాక్షన్ సినిమా. దీనికి విరాట్ సరిగ్గా సరిపోయాడు.
  • సత్యానంద్ గారు విరాట్ ని ప్రభాస్ తో పోల్చడం చాలా సంతోషంగా వుంది.
  • శ్రీకాంత్ గారు చేసిన పాత్రను చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు.
  • ఆ పాత్రని దర్శకుడిగా శ్రీకాంత్ గారే అంత చక్కడా చేయగలరు.
  • అలాగే ఇందులో అనసూయ, తనికెళ్ళ భరణి, రావు రమేష్ గారి పాత్రలు కూడా బలంగా వుంటాయి.
  • మిక్కీజే మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
  • పెదకాపులో 80నాటి రాజకీయ అంశాల నేపధ్యంలో వుండే కథ ఇది.
  • అఖండ 2 ఎప్పుడనేది చెప్పలేను కానీ అఖండ 2 ఖచ్చితంగా వుంటుంది.
  • ఈ సినిమాకి కంటిన్యూగా పెదకాపు 2 వుంటుంది.
  • అడివి శేష్ గారితో ఒక సినిమా, అలాగే మరో రెండు మూడు కథలు చర్చల్లో వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 7 =