సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఆ మధ్య అప్ డేట్లు కూడా ఇవ్వలేదు మేకర్స్. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 6వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ ఈసినిమా అప్ డేట్లను ఇవ్వడం మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. మందు మీద వచ్చే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాట మంచి బీట్ తో ఆకట్టుకుంటుంది.
Raise your glasses to the #MandhuSong! 🥂🎶 https://t.co/GmJOM66UxK
Don’t miss #MaamaMascheendra in theaters starting OCT 6th! ❤️🔥
@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids #NarayandasNarang @AsianSuniel @puskurrammohan pic.twitter.com/VX0t4pZJSk
— Sudheer Babu (@isudheerbabu) September 25, 2023
కాగా ఈసినిమాలో ఈషారెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈషా పుట్టినరోజు సందర్భంగా తన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో ఈషా వైరల్ విశాలాక్షి అనే పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: