దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక ఇందులో కథానాయకులుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‌లు దీని తర్వాత గ్లోబల్ స్టార్స్‌గా అవతరించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించిన తీరుకి హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.. తాజాగా తన ఫ్యాన్స్ లిస్టులోకి మరో ప్రముఖుడిని చేర్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. జీ20 సదస్సులో పాల్గొనడం కోసం భారత్ వచ్చిన ప్రెసిడెంట్ లూయిజ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీరు చూసిన ఏదైనా ఇండియన్ మూవీ గురించి చెప్పాలని యాంకర్ అడుగగా ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో ఇలా స్పందించారు. గత కొన్నిరోజుల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూశానని, ఇది తనకు అద్భుతంగా నచ్చిందని పేర్కొన్నారు.
అందుకే తనకు పరిచయమైనవారు కనిపిస్తే, ఆర్ఆర్ఆర్ మూవీ చూశారా? అని అందరినీ అడుగుతున్నానని కూడా తెలిపారు. ఆర్ఆర్ఆర్ మంచి ఫీచర్ ఫిల్మ్ అని, అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్స్ సినిమాలో ఉన్నాయని ప్రశంసించారు. 100 ఏళ్ల క్రితం ఇండియాపై బ్రిటిష్ నిరంకుశత్వ పాలన గురించి లోతుగా చర్చించిందని, దీనిని దర్శకుడు సరైన రీతిలో అర్థవంతంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులకు, డైరెక్టర్‌కు అభినందనలు’ అని బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా అన్నారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Sir… @LulaOficial 🙏🏻🙏🏻🙏🏻
Thank you so much for your kind words. It’s heartwarming to learn that you mentioned Indian Cinema and enjoyed RRR!! Our team is ecstatic. Hope you are having a great time in our country. https://t.co/ihvMjiMpXo
— rajamouli ss (@ssrajamouli) September 10, 2023
ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై బ్రెజిల్ అధ్యక్షుడి ప్రశంసలకు చిత్ర బృందం సహా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో రాజమౌళి ఇలా తెలిపారు.. “సర్ మీ మంచి మాటలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించారని మరియు ఆర్‌ఆర్‌ఆర్‌ని ఆస్వాదించారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది!! ‘ఆర్ఆర్ఆర్’ను ఎంజాయ్ చేశానని మీరు చెప్పడంతో నా హృదయం ఉప్పొంగుతోంది. మా టీమ్ పరవశించిపోతోంది. మా దేశంలో మీరు అద్భుతంగా సమయం గడపాలని కోరుకుంటున్నా” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: