లోకేష్ డైరెక్షన్ లో రజినీకాంత్

lokesh kanagaraj direct rajinikanth 171movie

సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీ నటించనున్నాడని వార్తలు వచ్చిన తెలిసిందే. ఇక ఆవార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు.రజినీ 171 సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.అన్బు- అరివ్ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా కాలం తరువాత జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు రజినీకాంత్.గత నెలలో విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 600కోట్ల వసూళ్ల ను రాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక్క తమిళంలోనే మిగితా అన్ని దక్షిణాది భాషల్లో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.తెలుగులో అయితే 45కోట్ల గ్రాస్ ను రాబట్టి షాక్ ఇచ్చింది.జైలర్ ఓటిటి లోకి కూడా వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఈసినిమా,సన్ పిక్చర్స్ కు భారీ లాభాలను తీసుకొచ్చింది.దాంతో ఈనిర్మాణ సంస్థ రజినీ తో వెంటనే మరో సినిమాను చేయడానికి సిద్ధమైంది.

ఇదిలావుంటే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియోతో బిజీగా వున్నాడు.విజయ్ హీరోగా నటిస్తున్నఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది.ఈసినిమా విడుదల తరువాతే రజినీ 171 సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 2 =