మొత్తానికి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది అనుష్క. నిశ్శబ్దం తరువాత అనుష్క నుండి ఎలాంటి సినిమా రాలేదు. చాలా గ్యాప్ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన దగ్గరనుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మొదటి షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అనుష్క ఇంకా నవీన్ పోలిశెట్టీల నటన, వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ ను అందిస్తుంది. యూఎస్ లో అయితే ఈసినిమా మరింత దూసుకుపోతుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ను అందుకున్న ఆసినిమా వీకెండ్ ముగిసే సరికి కేవలం మూడు రోజుల్లో 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. ఇంకా ప్రస్తుతానికి సినిమాలు కూడా లేవు కాబట్టి ఈసినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
#MissShettyMrPolishetty is officially the romantic LOLer-coaster ride of the decade🤌🏻🤌🏻
Crosses a whopping $1M+ mark in the opening weekend💥💥
𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐞𝐫 𝐎𝐟 𝐓𝐡𝐞 𝐘𝐞𝐚𝐫, #MSMP in cinemas now 🤩#BlockbusterMSMP #TheQueenisBack@UV_Creations… pic.twitter.com/noG412rkHc
— UV Creations (@UV_Creations) September 11, 2023
కాగా ఈసినిమాలో ఇంకా జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























