కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు

Prabhas Likely To Play Important Role in Vishnu Manchu's Kannappa

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వెల్లడయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు విష్ణు ఒక ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. కాగా సినిమా క్రిటిక్ రమేష్ బాలా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రభాస్ ‘కన్నప్ప’లో నటిస్తున్నట్లు ఒక ట్వీట్ చేయగా.. దీనికి స్పందించిన విష్ణు ‘హరహర మహాదేవ్‌’ అంటూ పోస్ట్‌ చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఈ కథలో కన్నప్పతో పాటు మహాశివుడి పాత్ర కీలకం. ఆ పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నట్లు సమాచారం.

‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ విష్ణు సరసన కథానాయికగా నటించనుంది. సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌ మరియు తోట ప్రసాద్‌ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. అలాగే మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.

కాగా దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ఈ ‘భక్త కన్నప్ప’. ఈ చిత్రం 1976లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి కళాత్మక దర్శకుడు బాపు దర్శకత్వం వహించగా.. వాణిశ్రీ, రావుగోపాలరావు, శ్రీధర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సోదరుడు యువి సూర్యనారాయణరాజు నిర్మించారు. తెలుగునాట ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యం నేపథ్యంలో ‘భక్త కన్నప్ప’గా ప్రసిద్ధుడైన తిన్నడు కథను స్ఫూర్తిగా తీసుకుని సినిమాగా తీశారు. హీరో కృష్ణంరాజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ మూవీ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 10 =