డబుల్ ఇస్మార్ట్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Double Ismart Update: Shoot Going on Rapid Pace in Mumbai

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు, దీనిలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చిత్ర బృందం పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఇక ఈ షెడ్యూల్లో హీరో రామ్ పోతినేని, బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గత కొన్నిరోజుల క్రితం విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్‌ లో ప్రజంట్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’లో.. సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతారంలో చూపించనున్నారు. అలాగే రామ్ మరియు సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్ గా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది.

ఇక ఇటీవలే రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్కంద’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్‌’ కోసం రామ్ ప్రత్యేకంగా స్టైలిష్ మేకోవర్‌ అవడం విశేషం. ఇక ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తుండటం గమనార్హం. అలాగే స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.