ఆ రెండు సినిమాలపై రాజమౌళి రివ్యూ.. ఏం చెప్పారంటే?

SS Rajamouli Reviews Miss Shetty & Mr Polishetty and Jawan

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం రాజమౌళి పేరుని చెప్పగానే గుర్తుపడతారంటేనే.. అర్ధమవుతోంది ఆయన ఎంత ఫేమస్ అయ్యారో. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ట్రెజర్ హంట్, ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆయన. అయితే తాజాగా రాజమౌళి ఇటీవలే విడుదలైన రెండు సినిమాలను వీక్షించారు. అంతేకాకుండా.. ఆ రెండు సినిమాల గురించి, అందులోని నటీనటుల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివరాల్లోకి వెళ్తే.. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ మరియు జవాన్ సినిమాలు నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాలను చూసిన అనంతరం రాజమౌళి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముందుగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి గురించి ఇలా చెప్పారు.. ‘స్వీటీ (అనుష్క) ఎప్పటిలాగానే ఈ సినిమాలో అందంగా కనిపించింది. నవీన్‌ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్‌తో హాస్యాన్ని, వినోదాన్ని బాగా అందించాడు. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా బృందానికి అభినందనలు. ఇలాంటి సెన్సిటీవ్‌ సబ్జెక్ట్‌ను వినోదాన్ని మేళవించి అద్భుతంగా హ్యాండిల్‌ చేసినందుకు దర్శకుడు మహేష్‌ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’ అని పేర్కొన్నారు.

అలాగే జవాన్‌ సినిమాపై కూడా దర్శకుడు రాజమౌళి తన స్పందనను ఇలా తెలియజేశారు.. ‘ఇలాంటి అసాధారణ ఓపెనింగ్స్ రాబడతాడు కాబట్టే షారుఖ్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ బాద్‌షా అయ్యాడు. నార్త్‌ లోనూ తన సక్సెస్ కొనసాగిస్తున్న డైరెక్టర్ అట్లీకు అభినందనలు. అద్భుతమైన విజయం సాధించిన జవాన్‌ టీమ్ కి నా అభినందనలు’ అని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =