చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

chandramukhi 2 movie pre release event date and venue locked

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు అన్నీ సినిపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వారికి మాత్రం నిరాశే ఎదురైంది.
తాజాగా ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. నిజానికి ఈసినిమాను సెప్టెంబర్ 17వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ సీజీ వర్క్ లు ఇంకా ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేశారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదికను ఖరారు చేస్తూ తెలియచేశారు. సెప్టెంబర్ 11వ తేదీన హైద్రాబాద్ లోని ఫిలింనగర్ లో జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ జరగనుంది.

కాగా ఈసినిమాలో కంగనా రనౌత్, వడివేలు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మరి సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − two =