బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ తో సెన్సేషన్ సృష్టించింది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇక తొలిరోజే 100కోట్ల వసూళ్లను రాబట్టడం షారుఖ్ కు ఇది రెండో సారి.ఇంతకుముందు షారుక్ నటించిన పఠాన్ కూడా తొలిరోజే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కేవలం హిందీ లోనే కాదు జవాన్…తెలుగు ,తమిళ్ లోకూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.తెలుగులో 8కోట్ల గ్రాస్ ను తమిళ్ లో 7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.సౌత్ లోబాలీవుడ్ హీరోకు ఈరేంజ్ ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.అదే జరిగితే 1000కోట్ల క్లబ్ లో చేరడం షారుక్ కు ఇది రెండోసారి కానుంది.పఠాన్ ఇంతకుముందు 1000కోట్లకు పైగా రాబట్టింది.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి,దీపికా పదుకోణ్ కీలకపాత్రల్లో నటించారు.అనిరుధ్ సంగీతం అందించాడు.రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























