టాలీవుడ్‌లో మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు ఉస్తాద్ రామ్ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న కొత్త చిత్రం ‘స్కంద’. ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇదిలా ఉంటే, ఇటీవలే విడుదల చేసిన మూవీ ట్రైలర్ కు అనూహ్య రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 50 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ లవర్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘నీ చుట్టూ చుట్టూ’, ‘గండరబాయ్’, ‘డుమ్మారే డుమ్మారే’ పాటలు వీక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ లో రామ్, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.
A Massive Milestone!!❤️🔥#SkandaTrailer rage hits 50 Million+ Views on YouTube💥
– https://t.co/uPHXc61x2e#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️#RAPOMass pic.twitter.com/5fAS6u4uKb
— Skanda Movie Official (@SkandaOffl) September 7, 2023
అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై సినీ లవర్స్‌తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. స్కంద సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 15నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో స్కంద టీమ్ అదే రోజున మూవీ రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: