బిగ్ బాస్ సీజన్ 7- బిగ్ బాస్ పై శివాజీ ఫైర్

bigg boss telugu season 7 day 4 highlights

రెండు రోజులు నామినేషన్స్, మూడో రోజు ఫేస్ ది బీస్ట్ అంటూ మొదటి టాస్క్ తో మూడు రోజులు ముగిశాయి. ఇక నాలుగో రోజు మొదలైపోయింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగే హౌస్ మేట్స్ ఫుడ్ కోరికలను చూపించాడు బిగ్ బాస్. లాన్ లో పొడుకొని ఉన్న దామిని ఈ టైమ్ లో ఛాయ్, బిస్కట్ ఉంటే ఎంత బావుంటుందో అంటూ మాట్లాడుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న బిగ్ బాస్ మొదటి టాస్క్ ఫేస్ ది టాస్క్ ఇచ్చి అందులో అర్హత సాధించిన వారికి ఐదు వారాల ఇమ్యూనిటీని కూడా ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అందులో ఆట సందీప్, ప్రియాంక గెలుపొందారు. నాలుగో రోజు మరో అవకాశం హౌస్ మేట్స్ కు ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరైతే బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేస్తారో వారిని మూడో కంటెండర్ గా అనౌన్స్ చేస్తానని చెప్తాడు.

బిగ్ బాస్ పై శివాజీ ఫైర్

ఇక బిగ్ బాస్ ను ఎప్పుడైతే ఇంప్రెస్ చేయమని చెబుతాడో హౌస్ మేట్స్ ఎవరి ప్రయత్నం వారు చేశారు. రతిక, అమర్ దీప్ అదుర్స్ లో చారి, బ్రహ్మీ పాత్రలు చేయగా.. ప్రిన్స్ మాత్రం లేడీ గెటప్ వేసుకున్నాడు.
శివాజీ మాత్రం వన్ మ్యా షో అయ్యాడు. ఈ మూడు రోజులు బిగ్ బాస్ చూసినవారికి అర్థమైఉంటుంది.. శివాజీకి కాఫీ కోసం ఎంత ఆరాటపడతాడో. ఇక తన వీక్ నెస్ నే టాస్క్ కు ఆడ్వాంటేజ్ గా తీసుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. కాఫీ పండండి బిగ్ బాస్ అంటూ.. తొక్కలో బిగ్ బాస్.. తొక్కలో బడ్జెట్ అని ఫైర్ అవుతూ.. గేట్లు తీసేయండి బయటకు వెళ్తా అంటూ నటించేశాడు. ఇక శివాజీని చూసి మిగిలిన హౌస్ మేట్స్ కూడా నిజమే అనుకొని కాఫీ పొడి పంపమని బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారు.

మరోవైపు బిగ్ బాస్ కూడా శివాజీ నటనలో భాగమై తన వంతు సపోర్ట్ కూడా అందించినట్టు అయింది. బిగ్ బాస్ బీపీ చెక్ చేసే కిట్ పంపించాడు. నేను ఎందుకు బీపీ చెక్ చేయించుకుంటానని చెప్పాడు శివాజీ. అందులో స్టెత్ గౌతమ్ కృష్ణ తీసుకున్నాడు. ఏంటి తమ్ముడు ఇప్పుడు నాకు చెక్ చేస్తావా అని సీరియస్ గా అడిగాడు శివాజీ. తర్వాత రతిక తీసుకుని.. పల్లవి ప్రశాంత్ హార్ట్ బీట్ చెక్ చేసింది. రతిక ప్రశాంత్.. హార్ట్ ఏమంటుందో చెప్పమని అడిగాడు బిగ్ బాస్. రతిక రతిక అని వినిపిస్తుందని చెప్పింది రతిక. ఇక చాలా సేపటితరువాత శివాజీని కన్పెషన్ రూమ్ కు పిలిచి కాఫీ ఇచ్చి పంపించాడు బిగ్ బాస్. ఇక శివాజీ కూడా తన నటనతో హౌస్ మేట్స్ ను నమ్మించడంలో సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ గా బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేసే టాస్క్ లో శివాజీ అలానే రతిక గెలుపొందారు. ఇక వీరిద్దరూ గెలవడంతో హౌస్ మేట్స్ ఒకింత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. వీరిద్దరికీ సీక్రెట్ టాస్క్ ఏదైనా ఇచ్చారా అన్న కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. మరోవైపు ప్రశాంత్ రోజులానే ఈరోజు కూడా కెమెరాలతో ఒక్కడే మాట్లాడుకున్నాడు. తాను మాత్రమే పనిచేస్తున్నాని చెబుతూనే.. మిగిలిన వారు పనిచేయట్లేదు అన్న కంప్లైట్ కూడా ఇచ్చాడు.

బిగ్ బాస్ గాసిప్స్

ఇక మిడ్ నైట్ గాసిప్స్ పై కాన్సన్ ట్రేట్ చేశాడు బిగ్ బాస్. ఈనేపథ్యంలోనే షకీలాను మిడ్ నైట్ కన్ఫెషన్ రూమ్ కు పిలిచి హోస్ లో గాసిప్స్ గురించి చెప్పమని చెప్పాడు. ప్రశాంత్ స్ట్రాంగ్ కానీ ఫేక్ అనిపిస్తుంది.. రతిక ప్రశాంత్ ను ఇన్ప్లూయన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.. ఇంకా గౌతమ్, శుభ రాత్రంతా ముచ్చట్లు పెడుతుంటారు..ప్రిన్స్ మంచొడు అని, కానీ ఫేక్ అని అందరితో కలిసేందుకు ట్రై చేస్తున్నాడని అంటుంది. ఎవరైనా ఫేక్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తున్నారా అని అడగ్గా.. అందరూ ఫేక్ రిలేషన్‍షిప్ అని, నాది కూడా అంతేనని తెలుపుతుంది. తర్వాత టేస్టీ తేజను పిలిచి ఇంట్లోనే స్పైసీ గాసిప్ చెప్పమని అడిగాడు. గౌతమ్, సుభాకు కనెక్ట్ అవుతున్నాడనిచెప్పాడు. ఫేక్ ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. ప్రశాంత్ అనిపిస్తున్నట్టుగా తెలిపాడు. అన్నం తినేప్పుడు కాళ్ల దగ్గర.. కూర్చొంటున్నాడని, పడుకునేప్పుడు కింద పడుకుంటున్నాడని.. అలా తినే ప్లేటు కాళ్ల దగ్గర ఉండటం కరెక్ట్ కాదని చెప్పాడు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + ten =