రివ్యూ : కింగ్ ఆఫ్ కొత్త 

king of kotha telugu movie review

నటీనటులు : దుల్కర్ సల్మాన్,ఐశ్వర్య లక్ష్మి,చెంబన్ వినోద్,నైలా ఉష
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
సంగీతం : జేక్స్ బిజోయ్
దర్శకత్వం :అభిలాష్ జోషియా
నిర్మాత : దుల్కర్ సల్మాన్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహనటి తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సీతా రామంతో మరింత దగ్గరయ్యాడు.ఇక దుల్కర్ నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త.మలయాళ సినిమా అయినా తెలుగుతోపాటు ఇతర భాషల్లోకి డబ్ అయ్యింది.ఈరోజే ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

రాజు (దుల్కర్ సల్మాన్ ) కణ్ణన్ (షబ్బీర్ కళ్లారక్కల్ ) ఇద్దరు మంచి స్నేహితులు.కొత్త అనే ఏరియాలో గ్యాంగ్ స్టర్ లు గా మారి ఆధిపత్యం చేస్తుంటారు అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి దాంతో ఇద్దరు శత్రువులు గా మారుతారు.ఇంతకీ వారిద్దరి మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటి? కొత్త కు ఎవరు డాన్ అవుతారు ?ఆధిపత్య పోరులో ఎవరు గెలుస్తారు?అలాగే రాజు,ఐశ్వర్య లక్ష్మి ప్రేమ ఏమైంది అనేదే మిగితా కథ.

విశ్లేషణ :
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఇంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు ఇదే ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త కూడా కొత్తగా ఏమి లేదు కానీ కథనం ను ఆసక్తిగా నడపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.సినిమా ప్రారంభమైన కొద్దీ సేపటికే కొత్త తో ట్రావెల్ చేస్తాం.దుల్కర్ నటన,స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు అయితే మధ్యలో వచ్చే పాటలు కథ కు అడ్డం పడుతున్నట్లు అనిపిస్తాయి.

ఇక సెకండ్ హాఫ్ లో సినిమా సీరియస్ గా సాగుతుంది.రెండు గ్రూప్ ల మధ్య  గొడవలు ఆతరువాత  ఎవరు ఆధిపత్యం కొనసాగిస్తారు అనే ఉత్కంఠంతో సాగుతుంది.క్లైమ్యాక్స్ ను బాగా డీల్ చేసాడు దర్శకుడు.కానీ సినిమా స్లో గా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. ఇదిఒక్కటే మేజర్ కంప్లైంట్ ఇది తప్పించి సినిమా అంత ఎంగేజింగ్ గా ఉంటుంది.దుల్కర్ నటన,జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే దుల్కర్ నటన ఇంతకుముందే మనం చూసేశాం.ఏ పాత్ర ఇచ్చిన దానికి తగ్గ న్యాయం చేస్తాడు ఇందులో కూడా రాజు అనే  పాత్రను ఓ రేంజ్ కి తీసుకెళ్ళి గ్యాంగ్ స్టర్ పాత్రలో మెప్పిస్తాడు అలాగే  హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి  నటన పరంగానే కాదు తెర మీద చాలా అందంగా కనబడింది.చెంబన్ వినోద్ సీరియస్ గా ఉంటూనే కామెడీ  చేసి నవ్వించాడు.మిగితా  పాత్రల్లో నటించిన అందరు పాత్రల పరిధి మేర  నటించారు.

టెక్నికల్ పరంగా చూస్తే సినిమా ఉన్నతంగా వుంది.డైరెక్టర్ తెలిసినా కథనే ఎంగేజింగ్ గా ప్రెజెంట్  చేయడం లో సక్సెస్ అయ్యాడు.డాన్ పాత్రలో దుల్కర్ ను చూపెట్టిన  విధానం మెప్పిస్తుంది.ఇక సినిమాలో కీ రోల్ ప్లే చేసింది జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.సాధారణ సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది అలాగే నిమిష్ రవి సినిమాటోగ్రఫీకి సినిమాకు మరో హైలైట్ అని చెప్పొచ్చు. విజువల్స్ అద్భుతంగా వున్నాయి.నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

ఓవరాల్ గా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త లో దుల్కర్ సల్మాన్ నటన,స్క్రీన్ ప్రెజెన్స్,జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.అక్కడక్కడా స్లో అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.