గాండీవధారి అర్జున బాధ్యతతో తీసిన సినిమా – వరుణ్‌ తేజ్‌

Varun Tej Special Interview About Gandeevadhari Arjuna Movie

టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ది ప్రత్యేక శైలి. కమర్షియల్‌ పంథాలో వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలు కలిగిన సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇదే క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ నటించిన మరో చిత్రం ‘గాండీవధారి అర్జున’. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌వీసీసీ పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముమ్మురంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘గాండీవధారి అర్జున’ సినిమా గురించి అనేక విశేషాలను తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం గురించి వరుణ్‌ తేజ్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..

  • ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో తెలుగు టైటిల్స్ అరుదుగా వస్తున్నాయి. అయితే ‘గాండీవధారి అర్జున’ అనేది చక్కటి తెలుగు టైటిల్‌. అలాగే కథకు బాగా యాప్ట్‌ అయ్యే టైటిల్‌ కూడా.
  • ఈ సినిమాలో నా పాత్ర పేరు అర్జున్‌. భారతంలో అర్జునుడు అంటే.. మహా వీరుడు, ఆపదలో ఉన్నవారికి రక్షణ కల్పిస్తాడని విన్నాం. అలాగే ఈ చిత్రంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా నన్నే పిలుస్తారు.
  • ఇక డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు ఇంతకుముందు చేసిన ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ సినిమాలు చూశాను. ఆయన సినిమాల్లోని కాన్సెప్ట్‌లు, సెన్సిబిలిటీస్‌ నాకు నచ్చుతాయి.
  • ‘చందమామ కథలు’ చిత్రంలో మంచి ఎమోషన్‌ ఉంటుంది. అలాగే ‘గరుడవేగ’లో స్టైలీష్‌ యాక్షన్‌ ఉంటుంది. ఈ రెండు సినిమాలూ కలిస్తే ఎలా ఉంటుందో ‘గాండీవధారి అర్జున’ అలానే ఉంటుంది.
  • సాధారణంగా నాకు యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రవీణ్‌ యాక్షన్‌ సినిమాలు తీయడంలో మంచి ఎక్స్‌పర్ట్‌. అందుకే ఓసారి ఆయన ఫోన్‌ చేసి మనం కలిసి ‘సినిమా చేద్దామా’ అని అడిగితే.. కథ కూడా వినకుండా చేసేద్దాం అని చెప్పా.
  • ఈ సినిమాని కూడా తన గత చిత్రాలవలె చాలా స్టైలిష్‌గా డిజైన్‌ చేశాడు. ఎక్కడా రోప్‌లు కానీ, సీజీ వర్క్‌ కానీ వాడకుండా కొన్ని యాక్షన్‌ సీన్లు చేశాం.
  • బాలీవుడ్‌లో ఒక సినిమా చేయాలని నాకు కూడా ఉంది. అయితే ఈ రోజుల్లో సినిమాకి హద్దులు చెరిగిపోయాయి. మంచి సినిమా చేస్తే, దానిలో కంటెంట్ నచ్చితే అన్ని భాషల ప్రేక్షకులూ చూస్తున్నారు.
  • ప్రస్తుతం నేను చేసే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాను హిందీలోనూ విడుదల చేయబోతున్నాం. దీనికోసం మూడు నెలలు కష్టపడి హిందీ నేర్చుకొని సెట్లో నా డైలాగులు నేనే చెప్పా.
  • రొటీన్‌ పద్దతిలో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రతీ సినిమాలో ఏదో ఓ కొత్తదనం ఉండాలని కోరుకొంటాను. అయితే కొన్నిసార్లు అది వర్కవుట్‌ అవ్వొచ్చు, మరికొన్నిసార్లు అవ్వకపోవొచ్చు.
  • ఇక ఒక నటుడికి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో నటించే సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఈ సినిమాతో నాకు ఆ అవకాశం దొరికింది. మంచి కథతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా వుండే సినిమా చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twenty =