ఈఏడాది సర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ద్విభాషా చిత్రంగా వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా రాబట్టి రెండు భాషల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇక ఈసినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మరోసారి తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు ధనుష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ తన 51వ సినిమాలో నటించనున్నాడు.ఈసినిమా పాన్ ఇండియా మూవీ గా రానుంది.ఇక ఈసినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ను తీసుకున్నారు. ధనుష్ తో కలిసి నటించడం రష్మికకు ఇదే మొదటి సారి కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది విడుదలకానుంది.
The ever-charming @iamRashmika shares her excitement about joining #D51 with a cute video ❤️🤩
A @sekharkammula film 🎥
Shoot begins soon ✨💫@dhanushkraja @AsianSuniel @puskurrammohan @SVCLLP @amigoscreation @UrsVamsiShekar @RIAZtheboss @V4umedia_#D51 #NarayanDasNarang pic.twitter.com/nigdjAwnSI
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 14, 2023
ఇదిలావుంటే ధనుష్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో ఒకటి కెప్టెన్ మిల్లర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమా తోపాటు పాటు ధనుష్ తన 50వ సినిమా లో కూడా నటిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: