సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్లీ చాలా గ్యాప్ తరువాత హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన సినిమా జైలర్. ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు ఉండగా దానికితోడు టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం దూసుకుపోతుంది. అందుకు నిదర్శనంగానే ఈసినిమా కలెక్షన్స్ నిలుస్తున్నాయి. కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 49 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇలా బ్లాక్ బస్టర్ ను కొట్టిన రజనీ కాంత్ ప్రస్తుతం చిన్న గ్యాప్ ను తీసుకుంటున్నారు. నిజానికి రజనీకి ఆద్యాత్మికత ఎక్కువన్న సంగతి తెలిసిందే కదా.. దీనిలో భాగంగానే అప్పుడప్పుడు ఆయన హిమాలయాలకు సైతం వెళుతుండేవాడు. ఇప్పుడు తాజాగా మరోసారి స్పిరిట్చ్యూ వల్ బ్రేక్ ను తీసుకుంటున్నారు. తన జైలర్ సినిమా రిలీజ్ అయి ఒకపక్క బ్లాక్ బస్టర్ కొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే.. రజనీ మాత్రం హిమాలయాలకు వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. ప్రస్తుతం రజనీ ఆయన స్నేహితులతో కలిసిన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ గా విడుదల చేశాయి. ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.ఇంకా ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు కనిపించారు.ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: